Telangana: వీడియో ఇదిగో, విచక్షణారహితంగా మహిళపై దాడి చేసిన స్థానిక రాజకీయ నేతలు, అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో ఘటన

అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో కొంతమంది రాజకీయ నాయకులు ఓ మహిళపై దాడి చేసిన వీడియో వైరల్ అవుతుంది. బాధిత మహిళ, ఓ నాయకుడికి మధ్య జరిగిన గొడవలో సదరు వ్యక్తితో పాటు పక్కనే ఉన్న మరి కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది.

Woman Attacked by Local Leaders (Photo-X)

అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలోని అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో కొంతమంది రాజకీయ నాయకులు ఓ మహిళపై దాడి చేసిన వీడియో వైరల్ అవుతుంది. బాధిత మహిళ, ఓ నాయకుడికి మధ్య జరిగిన గొడవలో సదరు వ్యక్తితో పాటు పక్కనే ఉన్న మరి కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ దాడి ఎందుకు జరిగిందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

వీడియో ఇదిగో, విశాఖలో మహిళను జుట్టు పట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన తోటి దుకాణదారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన

మరో ఘటనలో విశాఖ జిల్లా మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న ఓ మహిళపై కిరాతకంగా ప్రవర్తించారు తోటి దుకాణదారులు.టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు. ఆమెను కొద్ది దూరం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియో వెలుగులోకి వచ్చింది.

విచక్షణారహితంగా మహిళపై దాడి చేసిన స్థానిక రాజకీయ నేతలు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement