విశాఖ జిల్లా మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న ఓ మహిళపై కిరాతకంగా ప్రవర్తించారు తోటి దుకాణదారులు.టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు. ఆమెను కొద్ది దూరం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియో వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని తిరిగి తననే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. ఎలాంటి విచారణ చేయకుండానే ఇరు వర్గాలపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారని ఆమె వాపోయింది. కేసును రాజీ చేసుకోవాలంటూ లేదంటే హోటల్ సమయం మించి నిర్వహిస్తున్నందుకు తనపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని మహిళ ఆరోపించింది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Woman Dragged by Hair and Assaulted by Shopkeepers
టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన తోటి దుకాణదారులు
విశాఖ జిల్లా మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న ఓ మహిళపై కిరాతకంగా ప్రవర్తించిన తోటి దుకాణదారులు
ఆమెను కొద్ది దూరం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని… pic.twitter.com/xGJFFxH6Vy
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)