Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 2,983 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,07,904 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,983 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,07,904 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,983 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,706 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,14,639 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,88,105 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,472 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,062కి పెరిగింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement