2024 భారతదేశం ఎన్నికలు: రాజీనామా చేసి రా.. నువ్వా నేనా చూసుకుందాం, క‌డియం శ్రీహ‌రికి సవాల్ విసిరిన రాజయ్య, వీడియో ఇదిగో..

ద‌మ్ముంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని, ఇదే ఘ‌న్‌పూర్‌లో నువ్వా.. నేనా చూసుకుందాం అని అన్నారు.

Kadiyam Srihari vs Rajaiah

2024 భారతదేశం ఎన్నికలు: బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ద‌మ్ముంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని, ఇదే ఘ‌న్‌పూర్‌లో నువ్వా.. నేనా చూసుకుందాం అని అన్నారు. వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ విస్తృత స్థాయి స‌మావేశంలో రాజ‌య్య మాట్లాడుతూ.. క‌డియం శ్రీహ‌రికి సిగ్గు, శరం, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. అంతిమ పోరాటం మ‌న ఇద్ద‌రి మ‌ధ్య‌నే అని స్ప‌ష్టం చేశారు. మ‌న ఇద్ద‌రి మ‌ధ్య పోరాటం కోసం ఒక్క తెలంగాణ‌నే కాదు దేశం మొత్తం ఎదురుచూస్తోంద‌ని రాజ‌య్య తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన వీడియో ఇదిగో..

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif