BRS Rajendranagar MLA Prakash Goud to join Congress Watch Video

2024 భారతదేశం ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్‌ఎస్‌ రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు తెలియజేశారు. తన అనుచరులతో కలిసి, సీఎం సమక్షంలో ప్రకాష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. కాగా ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. వీరితోపాటు అనేకమంది ఎంపీలు, ముఖ్య నేతలు సైతం బీఆర్‌ఎస్‌ను వీడారు. భారతదేశం ఎన్నికలు మొదటి దశ పోలింగ్ నేడు జరుగుతోంది.  సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడు, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, లోక్ సభ ఎన్నికలే టార్గెట్‌గా నయా స్కెచ్

Here's Video