Telangana Road Accident: వీడియో ఇదిగో.. కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న ఆర్టీసీ బస్సు - లారీ.. 20 మందికి గాయాలు

RTC Bus and Lorry Collide Near Kondagattu in Jagtial District (Photo-Video grab)

Telangana Road Accident: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు మరియు లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఢీకొన్న తీవ్రతకు లారీ ముందు భాగం నజ్జునుజ్జయ్యింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు తీవ్ర శ్రమించి అతడిని బయటకు తీశారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వీడియో ఇదిగో.. బాలుడి ప్రైవేట్ పార్టును పట్టుకుంటూ రాపిడో రైడర్ లైంగిక వేధింపులు.. మైనర్ ఫిర్యాదుపై సంస్థ స్పందన ఏంటంటే..

RTC Bus and Lorry Collide Near Kondagattu

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement