SI Sexually Assaulted Woman: వీడియో ఇదిగో, ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేపల కూరతో రూంకి రావాలి, ఫిర్యాదు కోసం వచ్చిన మహిళపై ఎస్ఐ లైంగిక వేధింపులు
ఈ కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి. భర్తకు దూరంగా ఎందుకు ఉంటున్నావ్? అతనితో ఉండాలన్న కోరిక లేదా?' అని ప్రశ్నించాడని బాధిత మహిళ వాపోయారు.
ఫిర్యాదు కోసం పోలీస్ స్టేషన్ గడప తొక్కిన మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ఉదంతం మరిచిపోకముందే మరో దారుణం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలానికి చెందిన ఓ మహిళ భూమి విషయంలో జరిగిన ఘర్షణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ ఆమెను స్టేషన్‌కు పిలిపించారు. కామాంధుడైన పోలీస్ అధికారి, రివాల్వర్‌తో బెదిరించి తోటి మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడిన కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ గౌడ్
రెండు గంటలపాటు అతని చాంబర్లో ఉంచి, అభ్యంతరకరంగా మాట్లాడడంతోపాటు వేధింపులకు గురిచేశాడు. ఈ కేసును పరిష్కరించాలంటే నేను చెప్పినట్లు చేయాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. చేపల కూర, చికెన్ వండుకుని తేవాలి. నాకు కావల్సినప్పుడల్లా గ్రీన్ టీ చేసి పెట్టాలి. భర్తకు దూరంగా ఎందుకు ఉంటున్నావ్? అతనితో ఉండాలన్న కోరిక లేదా?' అని ప్రశ్నించాడని బాధిత మహిళ వాపోయారు. తనతో మంచిగా ఉంటే పూర్తి సహకారం ఉంటుందని ఎస్ఐ చెప్పినట్లు ఎస్పీ ఎదుట సదరు మహిళ బోరున విలపించారు. అతను చెప్పినట్లు చేయకపోవడంతో తన కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని, గొడవలు సృష్టించినట్లు ఫిర్యాదులో తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)