Man Injured in Wild Boar Attack: వ్యక్తిపై పగబట్టిన అడవి పంది, వెంబడించి మరీ దాడి చేసిన వీడియో వైరల్, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన

మెదక్‌ జిల్లాలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన జరిగింది. శనివారం అకస్మాత్తుగా పట్టణంలోని ఓ గాజుల దుకాణంలోకి అడవిపంది చొరబడింది.

man injured in wild boar attack in Medak

మెదక్‌ జిల్లాలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన జరిగింది. శనివారం అకస్మాత్తుగా పట్టణంలోని ఓ గాజుల దుకాణంలోకి అడవిపంది చొరబడింది. అనంతరం షాపు నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని వెంబడించి.. అతనిపై దాడి చేసింది.

షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతలపడిన బైక్ రైడర్లు, తీవ్ర గాయాలు

ఈ ఘటనలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వీడియోలో అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళడం చూడవచ్చు. అడవి పంది అటూ ఇటూ పరిగెడుతూ ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. ఈ దాడిలో అతను రోడ్డు మీద పడిపోయాడు. అనంతరం అడవిపంది అక్కడి నుంచి వెళ్లిపోయింది.

man injured in wild boar attack in Medak

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement