Telangana Shocker: వీడియో ఇదిగో, పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లి గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించిన యువకుడు
తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఆమె తల్లిపై యువకుడు హత్యాయత్నం చేశాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.
తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఆమె తల్లిపై యువకుడు హత్యాయత్నం చేశాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.ఈ విషయం తెలిసిన యువతి తల్లి.. కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు యువతి తల్లిపై అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆమెను దుండగుడి నుంచి రక్షించారు. పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
కరెంట్ తీగలపై ప్రమాదకర స్టంట్.. పుషప్స్ తీస్తు ఓ వ్యక్తి హల్ చల్, వైరల్‌గా మారిన వీడియో
Young man Attack on girlfriend mother for refusing to marry