Telangana Shocker: వీడియో ఇదిగో, మెడకు ఉరివేసుకుని రీల్స్, ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోవడంతో యువకుడు మృతి
ఫ్రిజ్ మీద సెల్ ఫోన్ పెట్టి.. దూలానికి ఉరి వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోయింది. ఈ ఘటనలో అజయ్ మృతి చెందాడు.
రీల్స్ మోజులో ఉరేసుకుని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కందకట్ల అజయ్(23) అనే యువకుడికి రీల్స్ చేసే అలవాటు ఉంది. ఉరి వేసుకుంటూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవాలి అనుకొని .. ఫ్రిజ్ మీద సెల్ ఫోన్ పెట్టి.. దూలానికి ఉరి వేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మెడకు తాడు బిగుసుకుపోయింది. ఈ ఘటనలో అజయ్ మృతి చెందాడు. అయితే అజయ్ గతంలో కూడా "3" మూవీలో హీరో ధనుష్ మానసిక పరిస్థితిని అనుకరిస్తూ ప్రమాదకరమైన రీల్స్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)