TSRTC Bus Collides with Oil Tanker: హన్మకొండలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌, 12 మందికి గాయాలు, బస్సులో 70 మంది ప్రయాణికులు

ములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. నీరుకుళ్ల శివారులోని జరిపోతుల వాగు మూలమలుపు వద్ద ఇవి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు.

TSRTC Bus Collides with Oil Tanker (Photo-Video Grab)

ములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. నీరుకుళ్ల శివారులోని జరిపోతుల వాగు మూలమలుపు వద్ద ఇవి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. మరో 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. ఆత్మకూరు సీఐ రవిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement