Google Birthday 2023: గూగుల్ 25వ జన్మదినం నేడు, గూగుల్‌ డూడుల్‌ ద్వారా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్న టెక్ దిగ్గజం, వీడియో ఇదిగో..

గూగుల్ (Google)‌ 25వ జన్మదినం నేడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్‌ డూడుల్‌ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది.సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట అంటే 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్‌ ఆవిర్భవించింది. అయితే, గూగుల్‌ తన పుట్టినరోజును ఏటా సెప్టెంబర్‌ 27వ తేదీన జరుపుకుంటోంది

Google Birthday 2023 (photo-X)

గూగుల్ (Google)‌ 25వ జన్మదినం నేడు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగుల్‌ డూడుల్‌ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది.సరిగ్గా పాతిక సంవత్సరాల కిందట అంటే 1998 సెప్టెంబర్ 4వ తేదీన గూగుల్‌ ఆవిర్భవించింది. అయితే, గూగుల్‌ తన పుట్టినరోజును ఏటా సెప్టెంబర్‌ 27వ తేదీన జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భానికి గుర్తుగా ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత గూగుల్ డూడుల్‌ మారిపోయింది.

Google స్థానంలో తన 25వ వార్షికోత్సవాన్ని తెలియజేస్తూ G25gle అనే అక్షరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం ఈ డూడుల్‌ ఆకట్టుకుంటోంది.అమెరికాకు చెందిన లారీ పేజ్‌, సర్జీ బ్రిన్‌ స్టోన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు 1998 సెప్టెంబర్‌ 4న ఈ సంస్థను స్థాపించారు. గూగుల్‌ మొదటి ఏడేళ్లు సెప్టెంబర్‌ 4నే వార్షికోత్సవం నిర్వహించింది. కానీ, రికార్డుల ఆధారంగా 2005 నుంచి సెప్టెంబర్‌ 27కి మార్చింది.

Google Birthday 2023 (photo-X)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement