Mario Molina Birth Anniversary: మారియో మొలీనా 80వ జయంతి నేడు, ప్రపంచాన్ని భయపెట్టిన ఓజోన్ రంధ్రం గురించి బయట ప్రపంచానికి తెలిపిన ప్రముఖ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందామా..
భూమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్ లేయర్‌కు క్లోరోఫ్లోరోకార్బన్‌లు నష్టం కలిగిస్తాయని, అంటార్కిటికా పైన ఉండే ఓజోన్ లేయర్‌లో రంధ్రం ఉందని కనుగొనడంలో ఈయన సహాయపడ్డారు.
మెక్సికన్ కెమిస్ట్ మారియో మొలీనా స్మృతిలో నేటి డూడుల్‌ను రూపొందించడం జరిగింది. భూమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్ లేయర్‌కు క్లోరోఫ్లోరోకార్బన్‌లు నష్టం కలిగిస్తాయని, అంటార్కిటికా పైన ఉండే ఓజోన్ లేయర్‌లో రంధ్రం ఉందని కనుగొనడంలో ఈయన సహాయపడ్డారు.ఓజోన్ పొర ధ్వంసమైతే అది మనిషి ఆరోగ్యం మీద, జీవావరణాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందనే వాస్తవాలను బయటి ప్రపంచానిక అందించారు.
ఈ ఓజోన్ పొరను సీఎఫ్‌సీలు ధ్వంసం చేయగలవని సిద్ధాంతీకరిస్తూ 1974లో శాస్త్రవేత్తలు మారియో మొలీనా, ఎఫ్ షెర్రీ రోలండ్‌లు ఒక అధ్యయనాన్ని ప్రచురించారు. అప్పటివరకూ సీఎఫ్‌సీలు నిరపాయకరమని భావించేవారు. అది తప్పని చెప్పిన మొలీనా, రోలండ్‌ల సిద్ధాంతాన్ని.. సీఎఫ్‌సీ ఉత్పత్తులు సురక్షితమైనవని వాదించే పరిశ్రమ రంగం కొట్టిపారేసింది. ఓ శతాబ్దం తర్వాత 1985లో బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే.. ఓజోన్ పొరకు రంధ్రం పడిందని నిర్ధారించింది. దానికి సీఎఫ్‌సీలతో లింకు ఉందనీ సూచించింది. దీంతో మొలీనా, రోలండ్‌ల తొలి సిద్ధాంతం నిజమని రుజువైంది. వారికి 1995లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు.
Here's Google Doodle
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)