Japan Earthquake: జపాన్‌లో మరోసారి భారీ భూకంపం, బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతగా నమోదు

జపాన్‌ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్‌ జపాన్‌లో 6.0 తీవ్రతతో మంగళవారం భూమి కంపించింది. హోన్షు కోస్ట్‌ (Coast of Honshu) తీరంలో మధ్యాహ్నం 2.29 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

జపాన్‌ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్‌ జపాన్‌లో 6.0 తీవ్రతతో మంగళవారం భూమి కంపించింది. హోన్షు కోస్ట్‌ (Coast of Honshu) తీరంలో మధ్యాహ్నం 2.29 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ సారి సునామీ (tsunami) హెచ్చరికలేవీ జారీ చేయలేదని జపాన్‌ మీడియా వెల్లడించింది.

కొత్త సంవత్సరం మొదటిరోజు జపాన్‌లో వరుస భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైనే ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతలో మరోసారి భూమి కంపించడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement