Kim Jong Un Suffering From Insomnia: 160 కిలోల బరువు,తీవ్రమైన నిద్రలేమితో అవస్థలు పడుతున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) తీవ్రమైన Insomniaతో బాధపడుతున్నాడని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎన్‌ఐఎస్‌) అంచనాకొచ్చింది.అంతే కాకుండా విపరీతంగా బరువు పెరిగినట్లు తన కథనంలో తెలిపింది.

Kim Jong-un. (Photo Credits: Wikimedia Commons)

ఉత్తరకొరియా (North Korea) నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) తీవ్రమైన Insomniaతో బాధపడుతున్నాడని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎన్‌ఐఎస్‌) అంచనాకొచ్చింది.అంతే కాకుండా విపరీతంగా బరువు పెరిగినట్లు తన కథనంలో తెలిపింది. అతడికి ఉన్న ఆల్కహాల్‌, నికోటిన్‌ వ్యసనాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారులు.. కిమ్‌ నిద్రలేమి సమస్యకు చికిత్స కోసం లోతైన వైద్యసమాచారం సేకరించే పనిలో పడ్డట్లు ఎన్ఐఎస్‌ గుర్తించింది.

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మద్యానికి, సిగరెట్లకు బానిసగా మారిపోయినట్లు అమెరికాకు చెందిన ఓ పత్రిక కథనంలో పేర్కొంది. దీంతో అతడిలో నిద్రలేమి సమస్యలు తలెత్తినట్లు తెలిపింది. ఫలితంగా అతడి కంటి కింద తీవ్రమైన నల్లటి వలయాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. అతడు జోల్పిడియం వంటి ఔషధాలను కూడా వాడుతున్నట్లు తెలిపింది.

News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement