IPL Auction 2025 Live

Mexico Metro Overpass Collapse: మెట్రో రైలు వెళుతుండగా కూలిన ఫైఓవర్‌, 20 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు, మెక్సికోలో విషాద ఘటన, వైరల్‌ మారిన సీసీ టీవీ దృశ్యాలు

సోమవారం మెట్రో ఫ్లైఓవర్‌ మీది నుంచి రైలు వేగంగా వెళుతున్న సమయంలో హఠాత్తుగా ఫైఓవర్‌ (Mexico Metro Overpass Collapse) కూలిపోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న కార్లపై మెట్రో రైలు పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, 70 మంది వరకు గాయపడ్డారు. సహాయక సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Mexico Metro Overpass Collapse (Photo Credits: Twitter)

ఈ ఘటనపై మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ స్పందిస్తూ.. మెట్రో రైల్‌ వెళుతుండగా బ్రిడ్జ్‌ కూలిపోవటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి 10.30 సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించాలని అధికారులును ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాద ఘటనకు సంబంధించి సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

సీసీ టీవీ దృశ్యాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)