Political Turmoil in Nepal: నేపాల్ అధ్యక్షుడు రాజీనామా, ప్రధాని రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రామ్ చంద్ర పొదెల్ రాజీనామా, ఆగ్రహ జ్వాలలతో అట్టుడుకుతున్న నేపాల్

నేపాల్ దేశంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలల వ్యక్తమవుతున్నాయి. హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ఇటీవల రాజీనామా చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు.

Ram Chandra Poudel (Photo Credits: Facebook)

నేపాల్ దేశంలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలల వ్యక్తమవుతున్నాయి. హింసాత్మక నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి ఇటీవల రాజీనామా చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు. నిరసనకారులు అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని ముట్టడించి, దానిని ధ్వంసం చేశారు. విలువైన వస్తువులు దోచుకోవడంతో అక్కబ చట్ట విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, ఓలి ప్రైవేట్ నివాసంపై కూడా దాడి చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇది సంక్షోభాన్ని మరింత గాఢతరం చేసింది.ఈ రాజకీయ కలవరానికి కారణాలు ఏంటంటే.. అవినీతిపై ప్రజల పెరుగుతున్న ఆగ్రహం, వాక్ స్వాతంత్య్రంపై ప్రభుత్వం విధించిన పరిమితులు. నేపాల్ అగ్ర నాయకుల జంట రాజీనామాలు దేశాన్ని అత్యంత అనిశ్చిత పరిస్థితికి నెట్టాయి. ప్రస్తుతం దేశంలో భవిష్యత్ రాజకీయ మార్గదర్శకత్వంపై తీవ్రమైన సందేహాలు కొనసాగుతున్నాయి.

Nepal President Ram Chandra Poudel Resigns Amid Violent Protests Over Social Media Ban

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement