Woman Fight Off Attacker: జిమ్‌లో కామాంధుడు, యువతిని నేలపై పడేసి అత్యాచార యత్నం, ధైర్యంగా పోరాడి శీలాన్ని కాపాడుకున్న యువతి, వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఫ్లోరిడాలో ఓ వ్యక్తి జిమ్ లోనే యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అగంతకుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తన శక్తికి మంచి ప్రయత్నించింది. కామాంధుడికి భయపడకుండా ధైర్యంగా పోరాడింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.
Woman Fight Off Attacker Inside Gym: ఫ్లోరిడాలో ఓ వ్యక్తి జిమ్ లోనే యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. అగంతకుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తన శక్తికి మంచి ప్రయత్నించింది. కామాంధుడికి భయపడకుండా ధైర్యంగా పోరాడింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. జనవరి 22న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫ్లోరిడాలోని టంపా నగరానికి చెందిన నషాలి అల్మా అనే 24 ఏళ్ల యువతి జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా వ్యక్తి జిమ్‌లోకి ప్రవేశించాడు. వ్యాయామం చేసుకుంటున్న యువతి వద్దకు వచ్చి గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. నేలమీద పడేసి లైంగికదాడికి ప్రయత్నించాడు. అయితే కామాంధుడికి చిక్కకుండా గట్టిగానే పోరాడింది నషాలి. భయపడకుండా ధైర్యంగా అతని బారి నుంచి తనను తాను రక్షించుకుంది. ఈ దృశ్యాలన్నీ జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని జేవియర్ థామస్-జోన్స్‌గా గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
Here's Video