Asia Cup 2025: ఆసియా కప్ 2025 ఫైనల్‌కి చేరిన భారత్, బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం, నేడు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ మధ్య రసవత్తర పోరు..గెలిచిన టీం ఫైనల్‌కు

ఆసియా కప్ 2025లో భారత జట్టు జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌, స్పిన్నర్ల మాయాజాలం తోడవడంతో మంగళవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

India Team (photo-X)

ఆసియా కప్ 2025లో భారత జట్టు జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌, స్పిన్నర్ల మాయాజాలం తోడవడంతో మంగళవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ వరుసగా ఐదో విజయాన్ని సాధించి ఫైనల్‌కి అర్హత సాధించింది. ఈ విజయంతో శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించగా, రెండో ఫైనల్ బెర్త్ కోసం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ మధ్య గురువారం మ్యాచ్ జరగనుంది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆట బంగ్లా బౌలర్లకు తలనొప్పిగా మారింది. కేవలం 37 బంతుల్లో 75 పరుగులు సాధించిన అభిషేక్.. సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులను అలరించాడు. శుభ్‌మన్ గిల్ (19 బంతుల్లో 29) కూడా అతనికి అద్భుతంగా జత కలవడంతో పవర్‌ప్లేలోనే భారత్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఈ దశలో బంగ్లాదేశ్ బౌలర్లకు ఎలాంటి ప్రత్యామ్నాయం కనబడలేదు.

దిగ్గజ క్రికెట్‌ అంపైర్‌ డికీ బర్డ్‌ కన్నుమూత, 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు చెప్పి అంపైరింగ్‌ వైపు..హస్యంతో క్రికెట్ ప్రేమికులను కట్టిపడేసిన లెజెండ్

అయితే, ఈ ఇద్దరు ఓపెనర్లు ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. మధ్యవరుసలో సూర్యకుమార్ యాదవ్ (5), శివమ్ దూబే (2), తిలక్ వర్మ (5) విఫలమవ్వడంతో జట్టు ఒత్తిడిలో పడింది. కానీ, చివరిలో హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38) బాధ్యతాయుతంగా ఆడి స్కోరును ముందుకు నెట్టాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుస్సేన్ 2 వికెట్లు తీయగా, షకీబ్ అల్ హసన్‌ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు.

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్లు మొదటి నుంచే చుక్కలు చూపించారు. ఓపెనర్ సైఫ్ హసన్ (51 బంతుల్లో 69) ఒంటరిగా పోరాడాడు. అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో జట్టు క్రమంగా కుప్పకూలింది. మూడు సార్లు క్యాచ్‌లు జారవిడిచినా, సైఫ్ అర్ధశతకంతో నిలబడగలిగాడు. అతనితో పాటు పర్వేజ్ హుస్సేన్ ఎమన్ (21) మాత్రమే కొంత ప్రతిఘటన చూపారు.

మిగతా బ్యాటర్లు భారత బౌలర్లకు తేలికగా వికెట్లు ఇచ్చారు. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ (3/18) స్పిన్ మాయాజాలంతో బౌలింగ్ చేసి బంగ్లా మధ్యవరుసను పతనం చేశాడు. వరుణ్ చక్రవర్తి (2/29) కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచాడు. జస్‌ప్రీత్ బుమ్రా (2/18) తన వేగం, లైన్‌తో బంగ్లా బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేశాడు. చివరికి బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ విజయంతో భారత్ ఫైనల్‌కి అర్హత సాధించింది. మరోవైపు, శ్రీలంక టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఫైనల్ బెర్త్ కోసం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న మ్యాచ్ కీలకంగా మారింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement