Angelo Mathews Timed Out: టైమ్‌ ఔట్‌పై స్పందించిన ఏంజెలో మాథ్యూస్‌, బంగ్లా కాబట్టే అలా ప్రవర్తించిందంటూ విమర్శలు గుప్పించిన శ్రీలంక క్రికెటర్

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చి టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Angelo Mathews Timed Out (Photo-X)

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చి టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ క్రీడాస్పూర్తి విరుద్దంగా వ్యవహరించాడంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఓటమి తర్వాత బంగ్లాదేశ్‌ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించిన శ్రీలంక ఆటగాళ్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

మ్యాచ్‌ అనంతరం ఈ విషయంపై మాథ్యూస్‌ స్వయంగా స్పందించాడు. షకీబ్‌ ప్రవర్తించిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ కాబట్టి అలా జరిగింది, మరే ఇతర జట్టు ఇలా స్పందిస్తుందని అనుకోను అంటూ కామెంట్స్‌ చేశాడు. మాథ్యూస్‌ను టైమ్‌ ఔట్‌గా ప్రకటించడంపై ప్రముఖ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బొరో కూడా స్పందించాడు.

Here's videos

ప్రపంచ క్రికెట్‌కు ఇది చీకటి రోజు. ఇలాంటి ఘటన ప్రపంచకప్‌లో జరగడం విచారకరం అంటూ ట్వీట్‌ చేశాడు. ఇందుకు ఓ వీడియోను జోడిస్తూ.. క్రీడాస్పూర్తిని చాటుకోవడంలో నేపాల్‌కు చెందిన ఆసిఫ్‌ షేక్‌ షకీబ్‌ కంటే వెయ్యి రెట్లు నయమని కామెంట్‌ జోడించాడు. నిన్నటి మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లాదేశ్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement