IPL 2022, DC vs SRH Highlights: సన్‌రైజర్స్‌కు హ్యాట్రిక్ పరాజయం, పాత టీమ్‌ మీద దుమ్మురేపిన డేవిడ్ వార్నర్, టీ-20 ఫార్మాట్‌లో కొత్త రికార్డు నెలకొల్పిన వార్నర్

21 పరుగుల తేడాతో హైదరాబాద్ ని చిత్తు చేసింది ఢిల్లీ (Delhi). తొలుత ఢిల్లీ కేపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ ఆఖర్లో తడబడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది.

Mumbai, May 06:  ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH) అపజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా ఓడిపోయింది ఎస్‌ఆర్‌హెచ్. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో (Delhi Capitals) తలబడ్డ హైదరాబాద్ టీమ్..లక్ష్యాన్ని చేరుకోవడంలో తడబడింది. 21 పరుగుల తేడాతో హైదరాబాద్ ని చిత్తు చేసింది ఢిల్లీ (Delhi). తొలుత ఢిల్లీ కేపిటల్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ ఆఖర్లో తడబడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులే చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో నికోలస్ పూరన్‌ (62)(Nicholas Pooran), మార్‌క్రమ్‌ (42), రాహుల్‌ త్రిపాఠి (22) తప్పితే ఎవరూ పెద్దగా ఆడలేదు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీశాడు. మిచెల్‌ మార్ష్‌, కుల్దీప్‌ యాదవ్‌, నార్జే చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్‌ (92*)(David Warner) దంచికొట్టాడు. ఈ సీజన్ లో హైదరాబాద్‌కు ఇది హ్యాట్రిక్‌ ఓటమి.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner) సూపర్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశారు.తన పాత టీమ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌పై వార్నర్‌ విరుచుకుపడిన తీరు అద్భుతమని చెప్పాలి. ఆరంభంలో ఇన్నింగ్స్‌ నెమ్మదిగా ఆరంభించిన వార్నర్‌.. ఆ తర్వాత గేర్‌ మార్చి ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌ ఓవరాల్‌గా 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. సెంచరీ అవకాశాన్ని మిస్‌ చేసుకున్నప్పటికి వార్నర్‌ పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టి20 క్రికెట్‌లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా వార్నర్‌ నిలిచాడు. ఎస్‌ఆర్‌హెచ్‌పై చేసిన హాఫ్‌ సెంచరీ వార్నర్‌ ఖాతాలో 84వది. తద్వారా క్రిస్‌ గేల్‌(83 అర్థసెంచరీలు) పేరిట ఉన్న రికార్డును వార్నర్‌(David Warner) బ్రేక్‌ చేశాడు. వార్నర్‌, గేల్‌ తర్వాత టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లి 77 హాఫ్‌ సెంచరీలతో మూడోస్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్‌ టి20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 70 అర్థసెంచరీలతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా టి20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 69 హాఫ్‌ సెంచరీలతో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

IPL 2022: మ్యాచ్ వదిలేసి లవ్ స్టోరీని చూపిన కెమెరాలు, ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌ జరుగుతుండగా యువకుడికి లవ్ ప్రపోజ్ చేసిన యువతి, యువకుడు ఓకే అనడంతో రింగ్ తొడిగిన లవర్  

అంతేకాదు ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనే వార్నర్‌ మరో రికార్డు అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో మార్క్రమ్‌ బౌలింగ్‌లో లాంగాన్‌ దిశగా భారీ సిక్సర్‌ కొట్టిన వార్నర్‌.. టి20 క్రికెట్‌లో 400వ సిక్సర్‌ను పూర్తి చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్‌ గేల్‌ 1056 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement