ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లైవ్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఒక యువతి అందరూ తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్‌ ప్రపోజ్‌ చేసింది. అందుకు సదరు యువకుడు అంగీకారం తెలపడంతో వెంటనే అతని చేతికి రింగ్‌ను తొడిగి తన సంతోషాన్ని పంచుకుంది. ఆ తర్వాత వారిద్దరు ఒకరినొకరు హగ్‌ చేసుకొని సంతోషంలో మునిగిపోయారు.మ్యాచ్‌ మధ్యలోనే ఈ తతంగమంతా జరగడంతో కెమెరాను అటువైపు తిప్పగా.. మైదానంలో ఉన్న ఆటగాళ్లు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)