కోట్లాది అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్‌-2025 షెడ్యూల్‌ ప్రకటించింది. ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా మార్చి 22న మొదలై రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించనునుంది ఐపీఎల్‌-18వ సీజన్‌. మే 25న జరిగే ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్‌ చాంపియన్స్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్‌తో 18వ సీజన్‌కు తెరలేవనుంది. 65 రోజుల పాటు దేశంలోని 13 వేదికలలో 74 మ్యాచ్‌లు (70 లీగ్‌, 4 ప్లేఆఫ్స్‌)గా జరగనున్నాయి. టోర్నీలో పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇక పండుగే! ఐపీఎల్ -2025 షెడ్యూల్‌ వచ్చేసింది, హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే?

గ్రూప్‌-1లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఉండగా గ్రూప్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఉన్నాయి.ఐదుసార్లు ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ (MI) మార్చి 23న చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ముంబై జట్టు రెండవ లీగ్ దశ మ్యాచ్ మార్చి 29న గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతుంది. మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబై తలపడనుంది. IPL 2025 కోసం ఐదుసార్లు ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ పూర్తి షెడ్యూల్ కోసం క్రింద చూడండి.

Mumbai Indians' Fixtures in Indian Premier League Season 18 and Venue Details

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)