IPL 2024: రసవత్తరంగా ఐపీఎల్, ప్లే అప్స్‌లో 3 స్థానాల కోసం పోటీ పడుతున్న ఐదు జట్లు ఇవే, ఇప్పటికే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకున్న కోలకతా

ఇక ఎనిమిది మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి.తాజా సినారియోలో కోల్‌కతా జట్టు ఒక్కటే ఇప్పటివరకు అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి. ముంబయి, పంజాబ్‌ మినహా మిగతా అన్ని జట్లు నాకౌట్‌ రేసులో ఉన్నాయి

IPL 2024, Delhi Capitals vs Kolkata Knight Riders

ఐపీఎల్ 2024 (IPL)సీజన్‌లో గ్రూప్‌ దశ దాదాపు ముగిసినట్లే.. ఇక ఎనిమిది మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి.తాజా సినారియోలో కోల్‌కతా జట్టు ఒక్కటే ఇప్పటివరకు అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీపడుతున్నాయి. ముంబయి, పంజాబ్‌ మినహా మిగతా అన్ని జట్లు నాకౌట్‌ రేసులో ఉన్నాయి. గత ఆదివారం రాజస్థాన్‌ను చెన్నై, ఢిల్లీని బెంగళూరు ఓడించడంతో ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది. 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉన్న ఢిల్లీ, 12 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో ఉన్న గుజరాత్ ప్లే ఆప్స్ అవకాశాలు దాదాపు శూన్యమేనని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే రాజస్థాన్‌, హైదరాబాద్‌ కచ్చితంగా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది.

ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ జట్టు దాదాపు ప్లేఆఫ్స్‌ చేరినట్టే. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (పంజాబ్‌, కోల్‌కతాతో) ఒక్క మ్యాచ్‌లో నెగ్గినా రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ రెండింటిలో ఓడినా అవకాశం ఉంటుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో కాకుండా తక్కువ తేడాతో ఓడాలి. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెట‌ర్, 700 వికెట్లు ప‌డ‌గొట్టిన ఇంగ్లాండ్ బౌల‌ర్ జేమ్స్ అండ‌ర్సన్ ఇక టెస్టు క్రికెట్ కు దూరం

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (గుజరాత్, పంజాబ్‌తో) విజయం సాధిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌ బెర్తును సొంతం చేసుకుంటుంది. మెరుగైన నెట్ రన్‌రేట్ ఉండటంతో ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా హైదరాబాద్‌ నాకౌట్‌ చేరే అవకాశముంది.

ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న లక్నో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ, ముంబయితో తలపడనుంది. ఈ జట్టుకు ప్లేఆఫ్స్‌ చేరడానికి  నెట్‌ రన్‌రేట్ ప్రతికూల అంశంగా మారింది. -0.769 నెట్‌ రన్‌రేట్‌ ఉన్న లక్నో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో నెగ్గితేనే నాకౌట్‌ దశకు చేరడానికి ఛాన్స్ ఉంటుంది.

ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే హైదరాబాద్‌ ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో ఓడాలి. దాంతో పాటు లక్నో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లోనే విజయం సాధించాల్సి ఉంటుంది. అలాగే మే 18న చెన్నైతో జరిగే మ్యాచ్‌లో తప్పక విజయం సాధించాలి. చెన్నైపై 18 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ రన్స్‌ తేడాతో గెలవాలి లేదా చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించాలి. అప్పుడే సీఎస్కే నెట్‌ రన్‌రేట్‌ను ఆర్సీబీ అధిగమిస్తుంది.

ఆర్సీబీ చేతిలో ఓడినా చెన్నైకి ఛాన్స్‌ ఉంటుంది. బెంగళూరుపై భారీ తేడాతో కాకుండా స్వల్ప తేడాతో ఓడి నెట్‌ రన్‌రేట్ పడిపోకుండా చూసుకోవాలి. దీంతోపాటు సన్‌రైజర్స్‌ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో ఓడిపోయి 14 పాయింట్లతో ఉండాలి. అంతేకాదు మే 14న లక్నోను డిల్లీ ఓడించాలి. శుక్రవారం ముంబయి చేతిలో లక్నో ఓడాలి లేదా స్వల్ప తేడాతో నెగ్గాలి. అప్పుడే నాలుగైదు జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉన్న జట్టు ముందంజ వేస్తుంది.