IPL 2023 Auction: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, రూ.18.50 కోట్ల‌కు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రూ.18.50 కోట్ల‌ భారీ ధ‌ర‌కు పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు అమ్ముడుపోయాడు.

Sam Curran (Photo-Twitter/IPL)

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రూ.18.50 కోట్ల‌ భారీ ధ‌ర‌కు పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు అమ్ముడుపోయాడు. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా అత‌ను గుర్తింపు సాధించాడు.త‌ర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరూన్ గ్రీన్..రూ.17.50 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కు అమ్ముడు పోయాడు.

మూడవ స్థానంలో బెన్ స్టోక్స్‌..రూ.16.25 కోట్ల‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ కు అమ్ముడుపోయాడు. ఈ ముగ్గురు ఆట‌గాళ్లు వేలం పాట మొద‌లైన‌ అర‌గంట‌లోనే అమ్ముడు పోవడం ఆశ్చర్యకర పరిణామంగా చెప్పవచ్చు. వీరితో పాటు ఇంగ్లండ్ ఆట‌గాడు హ్యారీ బ్రూక్.. రూ. 13.25 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టుకు అమ్ముడుపోయాడు.

ఐపీఎల్ వేలం, 991 మంది ప్లేయర్లలో 405 మంది ప్లేయర్లు షార్ట్‌ లిస్ట్‌, 87 స్థానాల కోసం వేలం, ఐపీఎల్‌ 2023 మినీ వేలం పూర్తి వివరాలు ఇవే..

ఐపీఎల్ వేలంలో సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్రాంఛైజీ ఒక ఆట‌గాడిని ఇంత ధ‌ర‌కు కొన‌గ‌డం ఇదే మొద‌టి సారి. అలాగే భార‌త ఆట‌గాడు మ‌యాంక్ అగ‌ర్వాల్‌ను ఈ ఫ్రాంఛైజీ రూ.8.25 కోట్ల‌కు కొన్న‌ది. భార‌త ఆట‌గాళ్ల‌లో అత్య‌ధిక ధ‌ర ద‌క్కించుకున్నఆట‌గాడిగా మయాంక్ నిలిచాడు.

వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్‌ రూ.7.25 కోట్లు ప‌లికాడు. ఇత‌డిని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ క్రికెట‌ర్‌ కేన్ విలియ‌మ్స‌న్ క‌నీస ధ‌ర‌కే అమ్ముడుపోయాడు. డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైట‌న్స్ అత‌డిని రూ.2 కోట్ల‌కు ద‌క్కించుకుంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

David Miller: సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్‌ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్

India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం

Virat Kohli New Record: ఫీల్డర్‌గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు

Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్‌లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు

Advertisement
Advertisement
Share Now
Advertisement