
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) సెమీస్‌లో న్యూజీలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయిన సంగతి విదితమే. గ్రూప్ స్టేజ్‌లో టాప్‌గా నిలిచిన సఫారీ జట్టుకు సెమీస్‌లో మాత్రం కివీస్ చేతిలో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 362 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో డేవిడ్ మిల్లర్ శతకం బాదినా 312 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓటమిపాలైంది.
దీనిపై డేవిల్ మిల్లర్ స్పందిస్తూ.. షెడ్యూల్ కారణంగానే తమకు తగినంత సమయం దొరకలేదని.. స్వల్ప వ్యవధిలో దుబాయ్‌కు వెళ్లి రావడం ఇబ్బందిగా మారిందనే అభిప్రాయం వ్యక్తంచేశాడు. కేవలం గంటా 40 నిమిషాల విమాన ప్రయాణమే. కానీ, అలా మేం రెండుసార్లు ప్రయాణించడం సరైంది కాదు. దుబాయ్‌కు సాయంత్రం 4 గంటలకు వచ్చాం. భారత్ - కివీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత రోజు ఉదయం 7.30 గంటలకు మళ్లీ పాక్‌కు వచ్చేశాం.
ఐదు గంటల పాటు విమానంలో ప్రయాణించినట్లు కాదు కానీ ఈ మ్యాచ్‌కు సన్నద్దమయ్యేందుకు మాత్రం తగినంత సమయం దొరకలేదని భావిస్తున్నాం. సెమీస్‌లో గెలిచిన కివీస్ తుది పోరులోనూ విజయం సాధిస్తుందని భావిస్తున్నా. తప్పకుండా గొప్ప ఫైనల్ అవుతుందని ఆశిస్తున్నా’’ అని మిల్లర్ వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ జట్టు తమ చివరి గ్రూప్ గేమ్‌లో కివీస్‌ను ఓడించి, ఆస్ట్రేలియాతో సెమీ-ఫైనల్ ఘర్షణకు సిద్ధమైనప్పుడు, దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌తో జరిగే సెమీ-ఫైనల్ మ్యాచ్ కోసం పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది