T20 World Cup 2022: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం, దక్షిణాఫ్రికాపై 33 పరుగుల తేడాతో ఘన విజయం

టీం 20 ప్రపంచ కప్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా మరోసారి వర్షం బారినపడింది.లక్ష్యాన్ని కుదించిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 33 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది. వర్షం అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులకు కుదించగా, ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 పరుగులు చేసింది

Pakistan Team

టీం 20 ప్రపంచ కప్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా మరోసారి వర్షం బారినపడింది.లక్ష్యాన్ని కుదించిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 33 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది. వర్షం అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 142 పరుగులకు కుదించగా, ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి కేవలం 108 పరుగులు చేసింది.

ఈ విజయంతో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. పాక్ ఇక సెమీస్ చేరాలంటే ఆదివారం జరిగే మ్యాచ్ లో భారత్... జింబాబ్వే చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో తన చివరి లీగ్ మ్యాచ్ లో పాక్... బంగ్లాదేశ్ పై గెలవాల్సి ఉంటుంది.

ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం, బంగ్లా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు, లిటన్‌ దాస్‌ శ్రమ వృధా, బ్యాటింగ్‌లో మరోసారి దుమ్మురేపిన విరాట్ కోహ్లీ

అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు చేసింది. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే సమయానికి 9 ఓవర్లలో 4 వికెట్లకు 69 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా... కొత్త టార్గెట్ నేపథ్యంలో 30 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే ఆ జట్టు లక్ష్యానికి 33 పరుగుల దూరంలో నిలిచిపోయింది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 3 వికెట్లు తీయగా, షాదాబ్ ఖాన్ 2, నసీమ్ షా 1, హరీస్ రవూఫ్ 1, మహ్మద్ వాసిం జూనియర్ 1 వికెట్ తీశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement