Ranji Trophy 2022-23: సెంచరీతో కదం తొక్కిన సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్, 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న అర్జున్

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది (Arjun Tendulkar) తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

Arjun Tendulkar

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది (Arjun Tendulkar) తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్‌.. 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి సచిన్‌ (Father Sachinr) వారసత్వాన్ని ఘనంగా చాటాడు.

కాగా 15 ఏళ్ల వయసులో సచిన్‌ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ బాది క్రికెట్‌ ప్రపంచానికి పరిచమయ్యాడు. 1988 రంజీ సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్రం చేసిన సచిన్‌.. తన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు. తాజాగా తనయుడు అర్జున్‌ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే శతక్కొట్టి, తండ్రికి తానే మాత్రం తీసిపోనని నిరూపించుకున్నాడు.

క్రీడలు, యువజన శాఖా మంత్రిగా సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడి

23 లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన అర్జున్‌ ఇప్పటివరకు 7 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌.. ముంబై ఫ్రాంచైజీలో స్థానం దక్కించుకున్నప్పటికీ, ఐపీఎల్‌ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం దొరకలేదు.

వైరల్ వీడియో, అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, ఆఫ్‌ సైడ్‌ పడిన బంతి టర్న్‌ అవుతూ స్టంప్స్‌ను అలా..

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌ గ్రూప్‌-సిలో భాగంగా నిన్న (డిసెంబర్‌ 13) రాజస్థాన్‌తో మొదలైన మ్యాచ్‌తో 4 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు బరిలోకి దిగిన అర్జున్‌.. ఇవాళ సెంచరీ పూర్తి చేసుకుని 112 పరుగుల వద్ద అజేయంగా కొనసాగుతున్నాడు. మరో ఎండ్‌లో సుయాశ్‌ ప్రభుదేశాయ్‌ (172 నాటౌట్‌) ఇవాళే సెంచరీ పూర్తి చేసుకుని డబుల్‌ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రెండో రోజు టీ విరామం సమయానికి గోవా 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement