Shardul-Mittali Marriage Date Out: ఫిబ్రవరిలో 27న పెళ్లి పీటలు ఎక్కబోతున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్-మిథాలీ పారుల్కర్
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఫిబ్రవరి 27న తన చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు.
Newdelhi, Dec 18: టీమిండియా (Team India) ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఫిబ్రవరి 27న తన చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్ (Mittali Parulkar) మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరికీ గతేడాది నవంబరులో (November) నిశ్చితార్థం జరిగింది. తాజాగా పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 24 వరకు షెడ్యూళ్లతో శార్దూల్ బిజీగా ఉండడంతో 27న ముహూర్తం నిర్ణయించారు.
25 నుంచే వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని మిథాలీ తెలిపారు. ముంబై శివారులోని కర్జత్‌లో మహారాష్ట్ర సంప్రదాయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరగనుంది. ఎంటర్‌ప్రెన్యూర్, మోడల్ అయిన మిథాలీ ప్రస్తుతం బేకింగ్ స్టార్టప్ నిర్వహిస్తున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Fire Breaks Out In New York: న్యూయార్క్లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Advertisement
Advertisement