Newdelhi, Dec 17: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఘనమైన రికార్డును (Record) సొంతం చేసుకున్నాడు. 22 నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి తిరిగొచ్చిన కుల్దీప్.. కెరియర్‌లోనే బెస్ట్ ఫిగర్స్ (5/40) నమోదు చేశాడు. మ్యాచ్ రెండో రోజు నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్.. మూడో రోజు ఒక వికెట్ పడగొట్టాడు.
వీడియో ఇదే.. రెండు హెల్మెట్‌లను తాకిన బంతి, భారత్‌కు అయిదు పెనాల్టీ పరుగులు
అంతకుముందు కుల్దీప్ భారత తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ రాణించి 40 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో కుల్దీప్.. ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) (5/87), మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) (4/55) రికార్డులను బద్దలుగొట్టాడు. బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఇండియన్ స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు.
5/40 - Kuldeep Yadav (2022)*
5/87 - Ravi Ashwin (2015)
5/142 - Sunil Joshi (2000)
Kuldeep Yadav has recorded his best bowling figure (5/40) in Test today.#KuldeepYadav #BestBowling#TeamIndia #IndvsBan #TestCricket pic.twitter.com/UOBpual7Tj
— Daddyscore (@daddyscore) December 16, 2022