Bangladesh, Aug 14: బంగ్లాదేశ్ రిజర్వేషన్ల అంశం తెచ్చిన తంటాతో దేశం విడిచిపారిపోయారు షేక్ హసీనా. ఆగస్టు 5న దేశం విడిచి వెళ్లిన తర్వాత సోషల్ మీడియా ద్వారా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొదటి ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో నిరసనల సందర్భంగా జరిగిన హింస, విధ్వంసంపై దర్యాప్తు చేయాలని కోరారు.
తన పార్టీ అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలు, ఇతరులపై జరిగిన ఘటనలు ఉగ్రదాడేనని, ఈ హింసాకాండకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, ఆగస్టు 15న జాతీయ సంతాప దినంగా జరపాలని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రకటన చేశారు.
ప్రస్తుతం హసీనా భారత్ లో ఆశ్రయం పొందగా ఆమెపై హత్య కేసును బంగ్లా పోలీసులు నమోదు చేశారు. హసీనాతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Here's Video:
నాకు న్యాయం కావాలి...
బంగ్లాదేశ్‌లో నిరసనల సందర్భంగా జరిగిన హింస, విధ్వంసంపై దర్యాప్తు చేయాలి.
అక్కడ జరిగినవి ఉగ్రవాద చర్యలు, హత్యలు, విధ్వంసకాండ.
ఆగస్టు 5న దేశం విడిచి వెళ్లిన తర్వాత సోషల్ మీడియా ద్వారా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొదటి ప్రకటన.#SheikhHasina… pic.twitter.com/m9Jgn3TH88
— BIG TV Breaking News (@bigtvtelugu) August 14, 2024
మొహమ్మద్ పూర్ లోని ఒక కిరాణా దుకాణ యజమాని అబు సయ్యద్ ఈ అల్లర్లలో చనిపోయాడు. అతని మరణానికి షేక్ హసీనా నే కారణమంటూ కూడా, అబుసయ్యద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదైంది.
బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలలో, 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తిలో పాల్గొన్న వారి కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని షేక్ హసీనా సర్కారు భావించింది. కానీ నిరుద్యోగుల ఆగ్రహానికి గురై దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.