Shreyas Iyer As Mumbai Captain: ర‌హానేకు షాక్ ఇచ్చిన సెల‌క్ట‌ర్లు, ముంబై కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్, పూర్తి జ‌ట్టు ఇదే!

గ‌త సీజ‌న్‌లో ముంబై జ‌ట్టును రంజీ విజేత‌గా నిలిపిన అంజిక్యా ర‌హానేకు సెలెక్ట‌ర్లు షాకిచ్చారు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)కోసం శ్రేయ‌స్ అయ్య‌ర్‌ (Shreyas Iyer)ను సార‌థిగా ప్ర‌క‌టించారు. ముంబై స్క్వాడ్‌కు అయ్య‌ర్ కెప్టెన్‌గా నియ‌మిస్తూ ఆదివారం ముంబై సెలెక్ట‌ర్లు ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.

Shreyas Iyer (Photo Credits: Twitter@ICC)

Mumbai, NOV 17: గ‌త సీజ‌న్‌లో ముంబై జ‌ట్టును రంజీ విజేత‌గా నిలిపిన అంజిక్యా ర‌హానేకు సెలెక్ట‌ర్లు షాకిచ్చారు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(Syed Mushtaq Ali Trophy)కోసం శ్రేయ‌స్ అయ్య‌ర్‌ (Shreyas Iyer)ను సార‌థిగా ప్ర‌క‌టించారు. ముంబై స్క్వాడ్‌కు అయ్య‌ర్ కెప్టెన్‌గా నియ‌మిస్తూ ఆదివారం ముంబై సెలెక్ట‌ర్లు ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీకోసం మొద‌ట‌ సెలెక్ట‌ర్లు 28 మందితో కూడిన‌ బృందాన్ని ఎంపిక చేశారు. కానీ, చివ‌ర‌కు కేవ‌లం 17 మందితో తుది జాబితాను వెల్ల‌డించారు. ఫిట్‌నెస్ లేక‌పోవ‌డంతో పాటు క్ర‌మ‌శిక్ష‌ణ ప‌ర‌మైన చ‌ర్య‌ల‌తో వేటుకు గురైన ఓపెన‌ర్ పృథ్వీ షా స్క్వాడ్‌లో చోటు ద‌క్కించుకున్నాడు.

India New T20 World Record: టీ20లో టీమిండియా సరికొత్త రికార్డు, అయితే పాకిస్తాన్ టాప్‌లో, దక్షిణాఫ్రికాపై 11 పరుగుల తేడాతో మూడో టీ20లో భారత్ ఘన విజయం 

ఆస్ట్రేలియా ఏ జ‌ట్టుపై తిప్పేసిన త‌నుష్ కొతియాన్‌కు సెలెక్ట‌ర్లు అవ‌కాశ‌మిచ్చారు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ ట్రోఫీ న‌వంబ‌ర్ 23 నుంచి డిసెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కూ జ‌రుగ‌నుంది.

ముంబై స్క్వాడ్ : శ్రేయ‌స్ అయ్య‌ర్(కెప్టెన్), పృథ్వీ షా, అయుశ్ హ‌త్రే, అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ, జై బిస్తా, అజింక్యా ర‌హానే, సూర్యాన్ష్ షెడ్గే, సిద్దేశ్ లాడ్, ఆకాశ్ ఆనంద్(వికెట్ కీప‌ర్), సాయిరాజ్ పాటిల్, హార్దిక్ తమొరె, ఆకాశ్ ఆనంద్, షామ్స్ ములానీ, హిమాన్షు సింగ్, త‌నుష్ కొతియాన్, శార్థూల్ ఠాకూర్, మోహిత్ అవ‌స్థి, రోస్ట‌న్ డియాస్, జునెద్ ఖాన్.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement