IPL 2022: ఓటమితో ఐపీఎల్ ప్రారంభించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఘన విజయం

ఐపీఎల్‌ తాజా సీజన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవంగా ఆరంభించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా కనీసం ఏ ఒక్క విభాగంలోనూ విలియమ్సన్‌ సేన (SRH vs RR Stat Highlights, IPL 2022) ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో (Rajasthan Royals Big Win) ఓడింది.

Rajasthan Royals bowlers celebrate after victory (Photo Credits: IPL/Twitter)

ఐపీఎల్‌ తాజా సీజన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవంగా ఆరంభించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా కనీసం ఏ ఒక్క విభాగంలోనూ విలియమ్సన్‌ సేన (SRH vs RR Stat Highlights, IPL 2022) ఆకట్టుకోలేకపోయింది. మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 61 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో (Rajasthan Royals Big Win) ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (55), పడిక్కళ్‌ (41), బట్లర్‌ (35), హెట్‌మయెర్‌ (13 బంతుల్లో 32) రాణించారు. ఉమ్రాన్‌, నటరాజన్‌కు చెరి 2 వికెట్లు దక్కాయి.

ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసి ఓడింది. మార్‌క్రమ్‌ (57 నాటౌట్‌), సుందర్‌ (14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40) మాత్రమే ఆకట్టుకున్నారు. చాహల్‌కు మూడు, ప్రసిద్ధ్‌.. బౌల్ట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సంజూ శాంసన్‌ నిలిచాడు. ఆర్‌ఆర్‌ జట్టు తరఫున కొత్తగా ఏడుగురు ప్లేయర్స్‌ బరిలోకి దిగడం విశేషం. జట్టును ముందుండి నడిపిస్తాడనుకున్న కేన్‌ విలియమ్సన్‌ 2 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. పది కోట్లకు పైగా పెట్టి కొనుగోలు చేసుకున్న నికోలస్‌ పూరన్‌ (0) సున్నా చుట్టాడు.

లక్నోపై విరుచుకుపడిన షమీ, ఐపీఎల్‌లో బోణీ కొట్టిన గుజరాత్‌ టైటాన్స్, 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం

మార్క్మ్‌ (41 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాషింగ్టన్‌ సుందర్‌ (14 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో భాగంగా బుధవారం బెంగళూరుతో కోల్‌కతా తలపడనుంది.

స్కోరు బోర్డు

రాజస్థాన్‌: బట్లర్‌ (సి) పూరన్‌ (బి) ఉమ్రాన్‌ 35, యశస్వీ (సి) మార్క్మ్‌ (బి) షెఫర్డ్‌ 20, శాంసన్‌ (సి) సమద్‌ (బి) భువనేశ్వర్‌ 55, పడిక్కల్‌ (బి) ఉమ్రాన్‌ 41, హెట్‌మైర్‌ (బి) నటరాజన్‌ 32, పరాగ్‌ (సి) పూరన్‌ (బి) నటరాజన్‌ 12, కౌల్టర్‌నైట్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 14, మొత్తం: 20 ఓవర్లలో 210/6. వికెట్ల పతనం: 1-58, 2-75, 3-148, 4-163, 5-207, 6-210, బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-29-1, షెఫర్డ్‌ 4-0-33-1, ఉమ్రాన్‌ 4-0-39-2, సుందర్‌ 3-0-47-0, నటరాజన్‌ 4-0-43-2, అభిషేక్‌ 1-0-15-0.

హైదరాబాద్‌: విలియమ్సన్‌ (సి) పడిక్కల్‌ (బి) ప్రసిద్ధ్‌ 2, అభిషేక్‌ (సి) హెట్‌మైర్‌ (బి) చాహల్‌ 9, రాహుల్‌ త్రిపాఠి (సి) శాంసన్‌ (బి) ప్రసిద్ధ్‌ 0, పూరన్‌ (ఎల్బీ) బౌల్ట్‌ 0, మార్క్మ్‌ (నాటౌట్‌) 57, సమద్‌ (సి) పరాగ్‌ (బి) చాహల్‌ 4, షెఫర్డ్‌ (బి) చాహల్‌ 24, సుందర్‌ (సి) హెట్‌మైర్‌ (బి) బౌల్ట్‌ 40, భువనేశ్వర్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 149/7. వికెట్ల పతనం: 1-3, 2-7, 3-9, 4-29, 5-37, 6-78, 7-133, బౌలింగ్‌: బౌల్ట్‌ 4-1-23-2, ప్రసిద్ధ్‌ 4-1-16-2, కౌల్టర్‌నైల్‌ 3-0-48-0, అశ్విన్‌ 4-0-21-0, చాహల్‌ 4-0-23-3, పరాగ్‌ 1-0-14-0.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement