Sri Lanka Squad For T20I Series: భారత్‌తో మూడు టీ20లకు శ్రీలంక జట్టు ఇదిగో, కెప్టెన్‌గా చరిత్ అసలంక, లంకలో టీమిండియా ప్రాక్టీస్ వీడియో ఇదిగో..

శ్రీలంక సెలక్షన్ కమిటీ.. చరిత్ అసలంక కెప్టెన్‌గా 16 మంది సభ్యులతో టీమ్‌ని ఎంపిక చేసింది. టీ20 ప్రపంచ కప్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ వానిందు హసరంగ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి విదితమే.

Charith Asalanka (Photo Credit: Twitter/@CricCrazyJohns)

Sri Lanka Announce Squad For T20I Series Against India: టిమిండియాతో త్వరలో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించింది. శ్రీలంక సెలక్షన్ కమిటీ.. చరిత్ అసలంక కెప్టెన్‌గా 16 మంది సభ్యులతో టీమ్‌ని ఎంపిక చేసింది. టీ20 ప్రపంచ కప్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ వానిందు హసరంగ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి విదితమే.

దీంతో అసలంకను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పల్లెకెలె వేదికగా జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం టీమ్ఇండియా సోమవారం శ్రీలంక చేరుకుంది. భారత్‌తోనే ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ టూర్‌లో టీ20ల్లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్‌, వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌లుగా వ్యవహరించనున్నారు. శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఇదే! టీ-20 కెప్టెన్ గా సూర్య‌కుమార్ యాద‌వ్, రెండు, వ‌న్డే, టీ-20 ల‌కు వైస్ కెప్టెన్ గా గిల్

ఇక లంకుకు వెళ్లిన మ‌రుస‌టి రోజే  టీమిండియాప్రాక్టీస్ షురూ చేసింది. హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్(Gautam Gambhir) తొలి శిక్ష‌ణా శిబిరంలో పాల్గొన్నాడు. ప‌ల్లెకెలె స్టేడియంలో ఆట‌గాళ్ల‌కు బ్యాటింగ్ స‌లహాలు ఇచ్చాడు. టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌తో పాటు అంద‌రితో వ్యాయామాలు చేయించాడు. భార‌త జ‌ట్టు నెట్స్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో పెట్టింది. భార‌త్, శ్రీ‌లంక‌లు జూలై 27 శ‌నివారం తొలి టీ20లో త‌ల‌ప‌డ‌నున్నాయి.భార‌త్‌, శ్రీ‌లంక‌లు కొత్త హెడ్‌కోచ్‌ల నేతృత్వంలో బ‌రిలోకి దిగుతున్నాయి.

Here's Video

ఇటు గౌతం గంభీర్‌కు, అటు లంక లెజెండ్ స‌న‌త్ జ‌య‌సూర్య‌(Sanath Jayasuriya)కు ప్ర‌ధాన కోచ్‌గా ఇది తొలి సిరీస్. దాంతో, ఇరువురు త‌మ మార్క్ చూపేందుకు సిద్ధ‌మ‌య్యారు.

భారత్‌తో మూడు టీ20లకు శ్రీలంక జట్టు

చరిత్ అసలంక (కెప్టెన్), పాథుమ్ నిశాంక, కుశాల్ జనిత్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, డాసున్ శనక, వానిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహీశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశా పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినూర ఫెర్నాండో.