Rohit Sharma: రోహిత్‌శర్మను కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. భారత్-జింబాబ్వే మ్యాచ్ జరుగుతుండగా ఘటన.. రోహిత్‌ను చూస్తూనే కన్నీళ్లు.. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి.. రూ. 6.5 లక్షల జరిమానా.. వీడియో ఇదిగో!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది. భారత్‌కు చెందిన ఓ అభిమాని తన ‘హీరో’ రోహిత్ శర్మను కలవాలని అనుకున్నాడు. అంతే.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. తర్వాత..

Rohit Sharma (Credits: Twitter)

Newdelhi, Nov 7: టీ20 (T20) ప్రపంచకప్‌లో (World Cup) భాగంగా జింబాబ్వేతో (Zimbabwe) నిన్న జరిగిన మ్యాచ్‌లో (Match) విజయం (Victory) సాధించిన భారత జట్టు సూపర్-12 గ్రూప్-2లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ నెల 10న ఇంగ్లండ్‌తో జరగనున్న సెమీస్ సమరానికి సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది. భారత్‌కు చెందిన ఓ అభిమాని తన ‘హీరో’ రోహిత్ శర్మను కలవాలని అనుకున్నాడు. అంతే.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు.

నటి పూర్ణకు పెళ్లి కానుకలు... భర్త నుంచి అబ్బురపరిచే గిఫ్ట్స్.. ఎన్ని కోట్ల విలువ ఉంటాయో తెలుసా?

గమనించిన  భద్రతా సిబ్బంది అతడి వెనక పరుగులు తీసి మొత్తానికి పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను చూస్తూనే అభిమాని ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే, అతడు రోహిత్‌ను కలవకముందే సిబ్బంది అతడిని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, మైదానంలోకి వచ్చి ఆటకు అంతరాయం కలిగించిన ఆ అభిమానిపై రూ. 6.5 లక్షల జరిమానా విధించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement