T20 World Cup 2022: సూర్యకుమార్ యాదవ్ నా బౌలింగ్‌ను ఐచకోత కోశాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ మొయిన్‌ అలీ, రేపు ఇంగ్లండ్‌తో టీమిండియా సెమీఫైనల్ పోరు

సెమీస్‌ సమరానికి ముందు టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై ( Suryakumar Yadav) ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, వైస్‌ కెప్టెన్‌ మొయిన్‌ అలీ (Moeen Ali) సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Suryakumar Yadav (Photo-Twitter)

సెమీస్‌ సమరానికి ముందు టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై ( Suryakumar Yadav) ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, వైస్‌ కెప్టెన్‌ మొయిన్‌ అలీ (Moeen Ali) సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో తన తొలి టీ20 సెంచరీ బాదిన సూర్య.. ఆ మ్యాచ్‌లో తనను చంపేశాడని, నాటి భయానక ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు.

ఆ మ్యాచ్‌లో 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో శివాలెత్తిన సూర్యకుమార్‌.. తనను మరే బౌలర్‌ భయపెట్టని విధంగా భయపెట్టాడని అన్నాడు. అదృష్టవశాత్తు అతను అలసిపోయి తన బౌలింగ్‌లోనే ఔట్‌ కావడంతో ఊపరిపీల్చుకున్నానని తెలిపాడు.

టీమిండియాకీ మరో భారీ షాక్, నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన విరాట్ కోహ్లీ, నిన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు గాయం

ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ఆడిన షాట్లు..క్రికెట్‌లో తాను చూసిన షాట్లలో అత్యుత్తమమని, ఇప్పటికీ అవి తన కళ్లముందే మెదులుతున్నాయని పేర్కొన్నాడు. ఆ ఇన్నింగ్స్‌ తర్వాతే తనకు సూర్యకుమార్‌ అంటే ఏంటో అర్ధమైందని, ఇప్పుడు అతనింకా రాటుదేలాడని, ప్రస్తుతం అతను ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 ఆటగాడని కొనియాడాడు.ఒక్కసారి అతను క్రీజ్‌లో కుదురుకున్నాక బౌలింగ్‌ చేయడం ఎంతటి బౌలర్‌కైనా చాలా కష్టమన్నారు.

క్రికెట్‌ చరిత్రలో ఇలా బౌలర్లను భయపెట్టే బ్యాటర్లలో సూర్యకుమార్‌ ముందు వరుసలో ఉంటాడని ఆకాశానికెత్తాడు.ఏబీడీ తర్వాత మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అన్న పేరుకు సూర్యకుమార్‌ వంద శాతం అర్హుడని, రేపు తమతో జరుబోయే సెమీస్‌ మ్యాచ్‌లో అతను శాంతంగా ఆడాలని ఆశిస్తున్నానని అన్నాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement