USA vs BAN T20I 2024: వామ్మో.. టీ20 ప్రపంచకప్‌కు ముందే టీ20 సిరీస్ కప్ ఎగరేసుకుపోయిన అమెరికా, బంగ్లాను చిత్తు చేసి చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ క్రికెట్ జట్టు
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కప్ ఎగరేసుకుపోయింది యూఎస్ఏ టీం. వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ప్రపంచకప్-2024 నిర్వహణ హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది.
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో పసికూన యూఎస్‌ఏ బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కప్ ఎగరేసుకుపోయింది యూఎస్ఏ టీం. వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ప్రపంచకప్-2024 నిర్వహణ హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది.
ఐసీసీ ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా యూఎస్‌ఏ- బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్ కోసం యూఎస్‌ఏ పర్యటనకు వెళ్లింది బంగ్లాదేశ్. మూడు మ్యాచ్ ల్లో తొలి టీ20లో అనూహ్య రీతిలో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన యూఎస్‌ఏ జట్టు రెండో టీ20లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
హోస్టన్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యూఎస్‌కే ఓపెనర్లు స్టీవెన్ టేలర్(31), కెప్టెన్ మొనాక్ పటేల్(42) శుభారంభం అందించారు. నిర్ణీత 20 ఓవర్లలో యూఎస్‌ఏ ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు సాధించింది. టీ20 ప్రపంచ కప్ కామెంటేటర్‌గా దినేశ్ కార్తీక్, మొత్తం 41 మందితో వ్యాఖ్యాతల జాబితాను ప్రకటించిన ఐసీసీ
అనంతరం 145 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా..యూఎస్ బౌలర్లు దెబ్బకు కుదేల్ అయింది. వీరి దెబ్బకు 19.3 ఓవర్లలో కేవలం 138 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ షాంటో 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తౌహీద్ హృదయ్ 25, షకీబ్ అల్ హసన్ 30 పరుగులు చేశారు.
ఇక యూఎస్‌ఏ బౌలర్లలో పాకిస్తాన్ మూలాలున్న 33 ఏళ్ల పేసర్ అలీ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. సౌరభ్ నట్రావల్కర్ రెండు, షాడ్లే వాన్ రెండు, కోరే ఆండర్సన్, జస్దీప్ సింగ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.అలీ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఐసీసీ అసోసియేట్ దేశమైన యూఎస్‌ఏ.. టెస్టు హోదా ఉన్న దేశంపై టీ20 సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. తద్వారా యూఎస్‌ఏ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించగా.. బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఇరు జట్ల మధ్య మే 25న నామమాత్రపు మూడో టీ20 జరుగనుంది.