MS Dhoni Lifts Ravindra Jadeja Video: ఒక్క వీడియోతో అన్ని రూమర్లకు పుల్‌స్టాప్, జడేజాను ఎత్తుకుని కన్నీటి పర్యంతమైన ధోనీ, మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న వీడియో
గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం నాటి తుదిపోరులో CSK ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాది జట్టుకు విజయం అందించగానే ధోని కళ్లల్లో ఆనంద భాష్పాలు కనిపించాయి. విన్నింగ్ షాట్ కొట్టగానే జడ్డూ డగౌట్ దిశగా పరిగెత్తుకు రాగా.. ఎంఎస్ ధోని ఒక్కసారిగా అతడిని ఎత్తుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం నాటి తుదిపోరులో CSK ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్ బాది జట్టుకు విజయం అందించగానే ధోని కళ్లల్లో ఆనంద భాష్పాలు కనిపించాయి. విన్నింగ్ షాట్ కొట్టగానే జడ్డూ డగౌట్ దిశగా పరిగెత్తుకు రాగా.. ఎంఎస్ ధోని ఒక్కసారిగా అతడిని ఎత్తుకున్నాడు. ధోని- జడేజా మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఈ వీడియోతో అన్నీ పటాపంచల్ అయ్యాయి.
ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జయభేరి.. ధోనీ భావోద్వేగం.. వీడియో వైరల్
ఓ మ్యాచ్‌లో తలా.. జడ్డూపై సీరియస్ కావడం.. ధోనికి ఇదే చివరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో సొంత జట్టు అభిమానులే ధోని కోసం జడేజా త్వరగా అవుటవ్వాలని కోరుకున్నారు. జడ్డూ భార్య రివాబా సైతం భర్తకు అండగా.. ‘‘నీకు నచ్చిన దారిలో వెళ్లు’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వీటిని మరింత బలపరిచాయి.ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ధోని.. జడ్డూను ఆత్మీయంగా హత్తుకుని ఎత్తుకున్న దృశ్యాలు అభిమానులకు కనుల విందుగా మారాయి.
Video
‘మీరెప్పుడూ ఇలాగే ఉండాలి. మీ గురించి వచ్చిన వార్తలు వట్టి వదంతులే అని తేలిపోవాలని కోరుకుంటున్నాం’’ అంటూ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియో మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ నెట్టింట వైరల్‌గా మారింది.