Benjamin Mendy: 10 వేల మందితో సెక్స్ చేశా, అందులో నీవున్నావో లేదో నాకు తెలియదు, జడ్జి ముందే బాంబు పేల్చిన శృంగార యోధుడు బెంజమిన్ మెండీ

ఫ్రాన్స్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ.. రెండేళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమెతో నేను 10 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నాను అంటూ చెప్పాడట. అయితే.. ఆ విషయాన్ని సదరు మహిళ కోర్టులో చెప్పింది. అంతే కాకుండా తానే అత్యాచారం చేశాడని కేసు వేసింది.

Benjamin Mendy (file image)

ఫ్రాన్స్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ.. రెండేళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమెతో నేను 10 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నాను అంటూ చెప్పాడట. అయితే.. ఆ విషయాన్ని సదరు మహిళ కోర్టులో చెప్పింది. అంతే కాకుండా తానే అత్యాచారం చేశాడని కేసు వేసింది.

యూకేలో చదువుతోన్న 24 ఏళ్ల యువతి.. బెంజిమన్ స్నేహితుడికి పరిచయం. అతనితో కలిసి ఆమె చెషైర్‌లోని బెంజిమన్ ఇంట్లో ఓ పార్టీకి హాజరైంది. సదరు యువతి ఆ రాత్రి అక్కడే బసచేయడంతో.. మరునాడు ఉదయం స్నానం చేసి బయటికి వస్తుండగా బెంజిమన్ అత్యాచారం చేయబోయాడు. అక్కడినుండి ఎలాగోలా తప్పించుకున్న ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరోకేసులో రెండేళ్ల క్రితం బెంజిమన్.. అప్పటికి 29 ఏళ్ల వయసున్న ఓ మహిళను బెడ్‌రూమ్‌లో నగ్నంగా బంధించి అత్యాచారం చేశాడన్నది ఆరోపణ. అంతేకాదు ఆమెను మంచానికి కట్టేసి బలవంతంగా అనుభవించాడట. ఈ రెండు కేసుల్లో అతనిపై విచారణ జరుగుతోంది. అయితే తనపై వస్తున్న వార్తలను కొట్టిపారేసిన బెంజమిన్.. తాను ఎటువంటి తప్పు చేయలేదని, వాళ్ల అంగీకారంతోనే అలా చేశానని చెప్పుకొచ్చాడు.

తార్నాకలో కామాంధుడు, లిఫ్ట్ పేరుతో యువతికి లైంగిక వేధింపులు. బైక్ మీద నుంచి దూకడంతో యువతికి తీవ్రగాయాలు

అయితే బెంజమిన్ మెండీపై ఉన్న రేప్ కేసుపై జరిగిన విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. మెండీ ఇప్పటి వరకూ 10 వేల మంది మహిళలతో సెక్స్ చేసినట్లు ఒప్పుకున్నారు.అతను 2020 లో 24 ఏళ్ల యువతిని తన లాక్డ్ రూమ్‌లోకి తీసుకెళ్లి రేప్ చేసిన ఆరోపణలపై విచారణ జరగ్గా.. అతను ఈ విషయం అంగీకరించారు.మెండీ ఇంట్లో నుంచి బయటకు వెళ్తే సాక్స్‌ల్లో కండోమ్స్ పెట్టుకుని వెళ్లేవాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మీడియాకు తెలిపారు.

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన బెంజిమన్.. ఉన్నట్టుండి 10వేలమందిని అనుభవించా ఆ లిస్టులో వీరున్నారో లేదో ఎలా గుర్తుంచుకోగలను అంటూ బాంబ్ పేల్చాడు. "ఏమో నాకైతే ఈ ఘటనలు జరిగినట్లు గుర్తులేదు. కానీ నేను ఇప్పటివరకూ 10 వేల మందితో సెక్స్ చేశా. కానీ ఎవ్వరినీ బలవంతపెట్టలేదు..' అంటూ మెజిస్ట్రేట్ ముందు తెలిపాడు.సెక్స్ ఆరోపణలతోనే అతడిని టోర్నమెంట్స్‌లో పాల్గొనకుండా నిషేధించిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఎలా ఉన్నా.. బెంజమిన్ మెండీ అత్యన్నత ఫుట్ బాల్ ప్లేయర్‌గా ఎదిగారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన మ్యాచ్‌లు ఆదేశానికి బోలెడు కప్పులు తీసుకెళ్లి ఫ్రాన్స్‌ను అగ్రభాగంలో నిలబెట్టారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement