
Hyd, july 3: హైదరాబాద్ నగరంలో తార్నాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇచ్చే వంకతో ఓ కామాంధుడు.. ఓ యువతిపై నడిరోడ్డుపై అదీ బైక్ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది.
తార్నక వద్ద లిఫ్ట్ ఇచ్చే వంకతో బైక్‌పై ఎక్కించుకుని లైంగిక దాడికి యత్నించారు. అయితే.. తప్పించుకునేక్రమంలో బైక్‌పై నుంచి దూకేసింది సదరు యువతి. అదే సమయంలో వెనక నుంచి లారీ దూసుకురావడంతో.. దాని కిందకు వెళ్లింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పేరు ఆర్తిగా గుర్తించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.