Gukesh Record in FIDE Candidates 2024: ఫిడే క్యాండిడేట్స్ టోర్నీలో గుకేశ్ సంచలనం.. విజయం సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డ్.. చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ శుభాకాంక్షలు
ఫిడే క్యాండిడేట్స్ టోర్నీలో భారత యువ సంచలనం గుకేశ్ విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో 17 ఏండ్లకే ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ దక్కించుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.
Newdelhi, Apr 22: ఫిడే క్యాండిడేట్స్ టోర్నీలో (FIDE Candidates 2024) భారత యువ సంచలనం గుకేశ్ (Gukesh) విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో 17 ఏండ్లకే ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ దక్కించుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించిన రెండో భారతీయుడిగా, మొదటి టీనేజర్ గా నిలిచాడు. క్లాసికల్ వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్ లో చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్‌తో తలపడనున్నాడు. అంతకు ముందు ఈ టోర్నికి భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ క్వాలిఫై అయ్యారు.
విశ్వనాథన్ ఆనంద్ విషెస్
ప్రపంచ చాంపియన్ షిప్ ఆడనున్న గుకేశ్ ను చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ శుభాకాంక్షలు తెలిపారు. అతి పిన్న వయస్కుడైన చాలెంజర్ గా మారినందుకు అభినందిచారు. నీ విజయానికి వాకా చెస్ (WacaChess) కుటుంబం చాలా గర్వపడుతున్నదన్నారు.