Milkha Singh Passes Away: దివికేగిన పరుగుల వీరుడు మిల్ఖా సింగ్, సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని,హోం మంత్రి తదితరులు, మొత్తం 80 రేసుల్లో 77 విజయాలతో అరుదైన రికార్డు ఫ్లైయింగ్‌ సిక్‌ సొంతం

భారత పరుగుల వీరుడు మిల్కాసింగ్ కన్నుమూశారు. ఆసియా గేమ్స్‌లో నాలుగుసార్లు బంగారు పతకాలు కొల్లగొట్టిన మిల్కా సింగ్ కొవిడ్ అనంతరం సమస్యలతో గత రాత్రి చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

Milkha Singh (Photo Credits: Twitter)

భారత పరుగుల వీరుడు మిల్ఖా సింగ్ కన్నుమూశారు. ఆసియా గేమ్స్‌లో నాలుగుసార్లు బంగారు పతకాలు కొల్లగొట్టిన మిల్కా సింగ్ కొవిడ్ అనంతరం సమస్యలతో గత రాత్రి చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.ఆయన (Milkha Singh Passes Away) వయసు 91 సంవత్సరాలు. కరోనాతో బాధపడుతూ మే 20న ఆసుపత్రిలో చేరిన సింగ్‌కు మూడు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆయనను నాన్ కొవిడ్ ఐసీయూ సెంటర్‌కు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతుండగానే గత రాత్రి పరిస్థితి విషమించి (Milkha Singh Passes Away At Age 91) కన్నుమూశారు. తండ్రి మరణించిన విషయాన్ని ఆయన కుమారుడు, దిగ్గజ గోల్ఫర్ జీవ్ మిల్ఖా సింగ్ ధ్రువీకరించారు. కాగా, మిల్కా సింగ్ భార్య, ఇండియన్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన నిర్మల్ సైనీ కౌర్ కరోనాతో ఈ నెల 13న మృతి చెందారు. 20 నవంబర్, 1929లో నేటి పాకిస్థాన్ లోని పంజాబ్‌లోని గోవింద్‌పుర‌లో మిల్కాసింగ్ జన్మించారు. విభజన అల్లర్లలో తల్లిదండ్రుల్ని పొగొట్టుకున్నాడు. బలవంతంగా శరణార్థ శిబిరాల్లో గడిపిన మిల్కా.. చివరికి 1947లో ఢిల్లీలో ఉంటున్న తన సొదరి దగ్గరికి చేరుకున్నాడు.

మే నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులు, భారత క్రికెటర్లకు దక్కని చోటు, టాప్‌లో పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ, మహిళల క్రికెట్లో క్యాథరిన్​

ఆ టైంలో టికెట్‌ లేకుండా ప్రయాణించిన నేరానికి కొన్నాళ్లు తీహార్‌ జైలులోనూ గడిపాడాయన. అల్లర్లలో తల్లిదండ్రుల్ని కోల్పోవడం, చేదు అనుభవాలు తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయని, ఒకానొక టైంలో దొపిడీ దొంగగా మారాలని అనుకున్నాడని ఆయన తరచూ ఇంటర్వ్యూలలో చెప్తుండేవాడు. అయితే సోదరుడి ప్రోత్సాహంతో ఆర్మీలో చేరి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ‘పరుగులు’ తీశాడు. ఇండియన్‌ ఆర్మీ పరీక్షల్లో మూడుసార్లు విఫలమైన మిల్కా సింగ్‌.. 1951 నాలుగో అటెంప్ట్‌లో సెలక్ట్‌ అయ్యాడు.

ఆర్మీలో టెక్నికల్‌ జవాన్‌గా మిల్ఖా సింగ్ ప్రస్థానం మొదలైంది. అయితే అక్కడి నుంచే ఆయన రన్నింగ్‌ రేసుల్లో పాల్గొనేవాడు. మన దేశంలో రన్నింగ్‌లో ‘ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌’ను ఇంట్రడ్యూస్‌ చేసింది మిల్కా సింగే. కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం గెలిచిన తర్వాత.. తన విజయానికి గౌరవంగా దేశవ్యాప్త సెలవు ప్రకటించాలన్న మిల్కా సింగ్‌ విజ్ఞప్తిని అప్పటి ప్రధాని నెహ్రూ సంతోషంగా అంగీకరించారు.

క్రికెట్లో విధ్వంసం అంటే ఇదే..28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అహ్మద్ ముస్సాదిక్, అందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు, గౌహర్ మనన్ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టిన కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ ఆటగాడు

పరుగుల పోటీల్లో భారత కీర్తి పతాకను వినువీధుల్లో చాటారు. 1958 జాతీయ క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించారు. 1958లో కామన్వెల్త్ పోటీల్లో 46.6 సెకన్లలోనే 440 గజాల దూరం పరుగెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత్ తరపున తొలి స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కారు. 1959లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. మిల్కా సింగ్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, హోం మంత్రి అమిత్ షా తదితరులు సంతాపం తెలిపారు

2001లో కేంద్రం ఆయనకు అర్జున అవార్డు ప్రకటించగా.. ‘40 ఏళ్లు ఆలస్యమైంద’ని పేర్కొంటూ ఆయన తిరస్కరించారు. ఆయన తన పతకాలన్నింటిని దేశానికే దానం చేశాడు. తొలుత ఢిల్లీ నెహ్రూ స్టేడియంలో ప్రదర్శనకు ఉంచిన వాటిని.. తర్వాత పటియాలాలోని స్పోర్ట్స్‌ మ్యూజియానికి తరలించారు. 1999లో కార్గిల్‌ వార్‌లో అమరుడైన బిక్రమ్‌ సింగ్‌ ఏడేళ్ల కొడుకును మిల్కా సింగ్‌ దత్తత తీసుకున్నాడు. మొత్తం 80 రేసుల్లో 77 విజయాలతో అరుదైన రికార్డు ఆయన సొంతమని చెప్తారు.

1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో మిల్కా సింగ్‌ నాలుగో స్థానంలో నిలిచాడు. అయితే అప్పుడు ఆయన నెలకొల్నిన 45 సెకన్ల రికార్డు బ్రేక్‌ చేయడానికి మరో భారత రన్నర్‌కి 40 ఏళ్లు పట్టింది. ఆసియా పరుగుల వీరుడి ట్యాగ్‌ దక్కించుకున్న అబ్దుల్‌ ఖలిక్‌పై 200 మీటర్ల పరుగుపందెంలో మిల్కా సింగ్‌ విజయం సాధించాడు. అది చూసి పాక్‌ జనరల్‌ ఆయూబ్‌ ఖాన్‌ ‘ఫ్లైయింగ్‌ సిక్‌’ అని పిలిచాడు. అప్పటి నుంచి అది ఆయన బిరుదుగా మారింది.

మిల్కా సింగ్‌ తన కూతురు సోనియా సాన్వాకాతో కలిసి ఆత్మకథ ‘ది రేస్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ రాసుకున్నాడు. ఈ బుక్‌ ఆధారంగానే బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ మెహ్రా, ఫర్హాన్‌ అక్తర్‌ను లీడ్‌ రోల్‌ పెట్టి ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ సినిమా తీశాడు. అయితే ఈ సినిమా కోసం తన బయోపిక్‌ హక్కుల్ని ఒక్క రూపాయికే ఇచ్చేసి ఆశ్చర్యపరిచాడు ఈ దిగ్గజం. కానీ, సినిమాకొచ్చే లాభాల్లో కొంత వాటాను పేద క్రీడాకారుల కోసం నెలకొల్పిన మిల్కా సింగ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కి ఇవ్వాలనే కండిషన్‌ పెట్టాడనే విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది.

కాగా మిల్కాసింగ్‌ భార్య నిర్మల్‌ కౌర్‌ కరోనా వైరస్‌తో పోరాడుతూ ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు ఆమె కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. 85 ఏళ్ల నిర్మల్‌ పంజాబ్‌ ప్రభుత్వంలో మహిళా స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా పని చేశారు. భారత మహిళల వాలీబాల్‌ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. క్రీడాకారులైన మిల్కా సింగ్‌- నిర్మల్‌ కౌర్‌ 1963లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు సంతానం.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now