Skill Development Scam Case: చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో దక్కని ఊరట, బెయిల్‌, సీఐడీ కస్టడీ పిటిషన్‌లు డిస్మిస్‌ చేసిన కోర్టు

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Chandrababu Naidu (Photo-Video Grab)

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులోఅరెస్ట్ అయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్‌ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్‌లను డిస్మిస్‌ చేసింది.

చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 5వ తేదీన ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మరికొన్ని వాదనలు వినిపిస్తానని పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి కోర్టును కోరడంతో కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో 6వ తేదీన మరికొన్ని అంశాలను ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.

చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, మూడు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం, నేడు సుప్రీంకోర్టులో విచారణకు ఎస్‌ఎల్‌పీ

ఆ తర్వాత సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకోవాల్సి ఉందని.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని కోరారు. అనంతరం చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే వాదనలు వినిపించారు. ఇప్పటికే ఒకసారి చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇచ్చారని.. రెండోసారి ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును సోమవారానికి రిజర్వ్‌ చేసింది. తాజాగా రెండు పిటిషన్లను డిస్మిస్‌ చేస్తూ తీర్పు వెలువరించింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Viveka Murder Case: జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisement
Advertisement
Share Now
Advertisement