Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం, పరీక్షా హాల్లో విద్యార్థిని కత్తితో పొడిచిన మరో విద్యార్థి, ప్రేమ వ్యవహారమే కారణమని వార్తలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దారుణం చోటుచేసుకుంది. రాజానగరం జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్‌ను మరో విద్యార్థి కత్తితో పొడిచాడు. ఎగ్జామ్‌ హాల్‌లోకి వచ్చిన ఆ విద్యార్థి.. టీచర్ల ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు

Representational Purpose Only (File Image)

Amaravati, April 20: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దారుణం చోటుచేసుకుంది. రాజానగరం జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్‌ను మరో విద్యార్థి కత్తితో పొడిచాడు. ఎగ్జామ్‌ హాల్‌లోకి వచ్చిన ఆ విద్యార్థి.. టీచర్ల ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు.తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. దాడికి పాల్పడిన విద్యార్థి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాల వద్దకు వెళ్లి వివారాలు సేకరిస్తున్నారు.

ప్రియురాలి మేనమామను కత్తితో నరికిన ప్రియుడు, మేనకోడలిని ఇంటికి తీసుకువెళతానని చెప్పడంతో ముదిరిన గొడవ

ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు గాయపడిన విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణహాని ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. తమ కళ్లముందే ఒక విద్యార్థి.. మరో విద్యార్థిని కత్తితో పొడవడం చూసి ఎగ్జామ్‌ హాల్‌లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రేమ వ్యవహారమే వీరి మధ్య ఘర్షణకు కారణమని తెలుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement