CM Jagan Meets HM Amit Shah: తెలుగు రాష్ట్రాల మధ్య విభ­జన సమస్యలు వెంటనే పరిష్కరించండి, హోం మంత్రి అమిత్‌ షా‌తో భేటీలో సీఎం జగన్

సీఎం మూడు రోజుల జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. తాజా పర్యటనలో తెలుగు రాష్ట్రాల మధ్య విభ­జన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Jagan Meets Amit Shah (PIC @ AP CMO Twitter)

New Delhi, May 29: సీఎం మూడు రోజుల జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. తాజా పర్యటనలో తెలుగు రాష్ట్రాల మధ్య విభ­జన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి ఆయన హోం మంత్రి నివా­సంలో అమిత్‌ షా తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ పరిష్కారం కాని పలు అంశాలపై చర్చించారు.

పోలవరం ప్రాజె­క్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపేలా చూడాలని కోరారు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య అపరి­ష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్క­రించాలని విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఏపీ భవన్‌ సహా షెడ్యూల్‌ 9, 10 ఆస్తుల విభజ­నపై కూడా చర్చించారు. తెలంగాణ ప్రభు­త్వం నుంచి రావాల్సిన విద్యుత్‌ బకా­యిల అంశాన్నీ హోం మంత్రి దృష్టికి తెచ్చారు. ఏపీ విద్యుత్‌ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరి­గణనలోకి తీసుకుని, వెంటనే ఈ బకా­యిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలకు నెలకు రూ. 1500, నిరుద్యోగులకు రూ.2500, ఎన్నికల మేనిఫెస్టోలో వరాలు కురిపించిన చంద్రబాబు, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పథకాల ప్రకటన

అంతకు ముందు రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం నిధులు సహా పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని సీఎం కోరారు. సుమారు అరగంటపాటు సమావేశం కొనసాగగా.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ సానుకూలంగా స్పందించారు.

అంతకుముందు నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. సమావేశానుద్దేశించి ప్రసంగించిన సీఎం.. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతంచేయాలని తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుందన్నారు. అలాగే నీతి ఆయోగ్‌ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్‌ను సమావేశానికి సమర్పించారు.

ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట, తీర్పు ప్రకటించే వరకు ఆరెస్ట్ చెయ్యొద్దని హైకోర్టు ఆదేశం

కాగా, మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం శుక్రవారం నాడు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సుమారు 40 నిమిషాలు భేటీ అయ్యారు. నాడు–నేడు పథకం ద్వారా విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (మూలధన పెట్టుబడి)గా భావించి ప్రత్యేక సాయం వర్తింప చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement