Andhra Pradesh: తిరుమలలో దారుణం, మూత్ర విసర్జన చేస్తుండగా భక్తుడిని బండరాయితో బాది చంపిన దుండగుడు, సీసీటీవీ పుటేజీలో వీడియో రికార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా తిరుమలలో ఓ భక్తుడిని దుండగులు బండరాళ్లతో కొట్టి (Devotee crushed to death with boulder ) చంపారు. బుధవారం అర్ధరాత్రి ఎస్‌వీ మ్యూజియం సమీపంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Tirumala, July 21: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా తిరుమలలో ఓ భక్తుడిని దుండగులు బండరాళ్లతో కొట్టి (Devotee crushed to death with boulder ) చంపారు. బుధవారం అర్ధరాత్రి ఎస్‌వీ మ్యూజియం సమీపంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ షాకింగ్ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఘటనకు సంబంధించిన వీడియోలో దాడి చేసిన వ్యక్తి ( attacker in Tirumala) భక్తుడి వద్దకు వచ్చి బండరాయితో చితకబాదినట్లు కనిపించింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

IANS నివేదిక ప్రకారం, ఘటన సమయంలో బాధితుడి ఏడుపులకు ఇతర వ్యక్తులు మేల్కొని ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపే దుండగుడు అక్కడి నుండి పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ (incident caught on CCTV) సాయంతో పోలీసులు దాడి చేసిన వ్యక్తిని రెండు గంటల్లో అరెస్ట్ చేశారు. నిందితుడిని అలిపిరి సమీపంలో అరెస్టు చేశారు. నిందితుడిని కందస్వానీగా గుర్తించారు.

ప్రియుడితో రాసలీలలకు భర్త అడ్డు, నిద్రపోతుండగా ప్రియుడితో కలిసి కుక్కర్‌తో కొట్టి చంపేసిన భార్య, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన కసాయి

బాధితుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు తమిళనాడు వాసి. హత్య వెనుక గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement