Anakapalle Pharma Company Explosion: ఆగస్టు 23న అనకాపల్లిలో రియాక్టర్ పేలిన ప్రమాదస్థలానికి జగన్, బాధితులకు అండగా నిలవాలని స్థానిక వైసీపీ నాయకులకు ఆదేశాలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు ఘటనాస్థలిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(శుక్రవారం) పరిశీలించనున్నారు. రేపు ప్రమాదస్థలానికి సీఎం వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ ఎల్లుండి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

YS Jagan Mohan Reddy in Delhi (Photo-ANI)

Anakapalle, August 21: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు ఘటనాస్థలిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(శుక్రవారం) పరిశీలించనున్నారు. రేపు ప్రమాదస్థలానికి సీఎం వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ ఎల్లుండి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

ఫార్మాకంపెనీలో రియాక్టర్‌ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఇప్పటికే వారిని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.  అచ్యుతాపురం పేలుడు ఘటనపై  జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా ఉత్తమ వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపి మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరో 50మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement