Alla Nani Quits YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా వెళుతున్నానని వెల్లడి

వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Alla Nani

Vjy, August 9: వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆళ్ల నాని పేర్కొన్నారు.  భద్రత కుదింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాన్ని రీప్లేస్‌ చేస్తామని తెలిపిన ఏపీ ప్రభుత్వం

ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆళ్ల నాని పనిచేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

New Trend In China: బ్యాంకుల దగ్గర మట్టి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం! ఆన్‌లైన్‌లో రూ. 10వేలకు అమ్ముతున్న వ్యాపారులు

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement