APSRTC: ఏపీలో బస్సు ఛార్జీలు పెరిగాయి, పల్లెవెలుగు సర్వీసులపై రూ. 2 పెంపు, ఇకపై పల్లె వెలుగు బస్సుల్లో మినిమమ్‌ ఛార్జీ రూ. 10, డిజీల్‌ సెస్‌ కింద పెంచామని తెలిపిన ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

ఏపీలో బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ( MD Dwarka Thirumala Rao) మీడియాతో తెలిపారు. డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. డీజిల్‌ బల్క్‌ రేటు విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు.

APSRTC to stops all 168 services to Karnataka from tomorrow amid Bengaluru going under complete lockdown (Photo-ANI)

Amaravati, April 13: ఏపీలో బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ( MD Dwarka Thirumala Rao) మీడియాతో తెలిపారు. డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. డీజిల్‌ బల్క్‌ రేటు విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చు కూడా రాకపోతే ఆర్టీసీ (APSRTC) పూర్తి నష్టాల్లోకి వెళుతుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిజీల్‌ సెస్‌ కింద పెంచాల్సి ( hikes bus fares) వస్తోందని పేర్కొన్నారు. పల్లెవెలుగు సర్వీసులపై రూ. 2 పెంపు ఉండనుంది. ఇకపై పల్లె వెలుగు బస్సుల్లో మినిమమ్‌ ఛార్జీ రూ. 10 గానిర్ధారించారు. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులపై రూ. 5 పెంచారు. ఏసీ బస్సుల్లో రూ. 10 పెంచారు.

తప్పనిసరి పరిస్థితుల్లో పెంపుదల తప్పట్లేదన్న ఆయన.. ఇది ఛార్జీల పెంపు కాదని గుర్తించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పెంచిన ధరలు రేపటి(ఏప్రిల్‌ 14) నుంచే అమలులోకి రానున్నాయి. ప్రయాణికులు అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. పల్లెవెలుగు కనీస ఛార్జీ ఇకపై రూ.10గా నిర్ణయించామని తెలిపారు. కరోనా వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడిందని పేర్కొన్నారు.

ప్రతీ మండలంలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కాలేజీ, కార్యాచరణ తయారుచేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి

ఆర్టీసీపై రోజుకు రూ.3.5 కోట్ల భారం పడుతోందని తెలిపారు. రెండేళ్లుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పెంపు నిర్ణయించామని తెలిపారు. డీజిల్‌ సెస్‌ మాత్రమే పెరుగుదల అని పేర్కొన్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement