Amaravati, April 13: విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష (CM YS Jagan Review) నిర్వహించారు. నాడు-నేడు రెండో దశ వేగం పెరగాలని, శరవేగంగా పనులు పూర్తి చేయాలని సీఎం (CM YS Jagan) ఆదేశించారు. రెండో దశ కింద దాదాపు 25 వేల స్కూళ్లలో పనులు చేపడుతున్నామని.. రెండో దశ నాడు-నేడు పనుల ద్వారా స్కూళ్లలో గణనీయంగా మార్పులు ఈ ఏడాది కనిపించాలని సీఎం అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా నాడు-నేడు కింద పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. నాడు-నేడు (Nadu Nedu) ద్వారా చరిత్రలో ఈ ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. నాడు-నేడు రెండోదశ ఖర్చు రూ. 11,267 కోట్లుగా అంచనా వేశారు. ఇక ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి ఇంగ్లిషు మాధ్యమంలోకి తీసుకురానున్నారు. నాడు-నేడు కింద 468 జూనియర్ కళాశాలల్లో పనులు చేపట్టారు. నాడు-నేడు కింద 468 జూనియర్ కళాశాలల్లో పనులు చేపడుతున్నామని తెలిపారు. దీంతోపాటు ప్రతి మండలానికీ 2 జూనియర్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీటిలో అమ్మాయిలకోసం ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు కావాలని, దీనిపై కార్యాచరణ తయారుచేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
దశలవారీగా ఏర్పాటవుతున్న స్కూళ్లకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం కూడా చేపట్టాలని సీఎం తెలిపారు. 2022 జులై, 2023 జులై, 2024 జులై... ఇలా దశలవారీగా ఈ 6 కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు కావాలన్నారు. ప్రతి హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూళ్లన్నీ కూడా సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌తో ఉండాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇంగ్లిషు పదాల ఉచ్ఛారణపై యాప్‌ను టీచర్లకు, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్న సీఎం తెలిపారు. తల్లిదండ్రుల ఫోన్లలో కూడా ఈ యాప్ అందుబాటులో ఉంచేలా చూడాలని అధికారులకు సీఎం తెలిపారు.
ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఎస్‌ఎస్‌ఏ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.